Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (18:39 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయి 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనపై ఎయిర్‌‍క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్‌కు ముప్పు పొంచివున్నట్లు నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది. 
 
ఏఏఐబీ డీజీ యుగంధర్‌కు ఇక నుంచి ఎక్స్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. జూన్ 16వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నాయి. దీని ప్రకారం ఆయనకు సీఆర్పీఎఫ్ కమాండాలతో రక్షణ కల్పిస్తున్నారు. ఈ ఘటన జూన్ 12వ  తేదీన చోటుచేసుకోగా, ఆ మరుసటి రోజే ప్రమాదంపై దర్యాప్తునకు ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 
 
దీనికి యుగంధర్ నేతృత్వం వహిస్తుండగా ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణలు సభ్యులుగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌లను ఏఏఐబీ ల్యాబ్‌కు తరలించారు. అందులోని డేటాను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments