Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో వాయు కాలుష్యం.. 80 లక్షల మంది మృత్యు ఒడిలోకి!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:26 IST)
భారతదేశంలో ఏటా 27 లక్షల మంది వాయు కాలుష్యానికి బలి అయిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 27లక్షలమంది వాయు కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతుంటే.. అదే ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారని వెల్లడైంది. వాయుకాలుష్యంతో జరిగే మరణాలు ఎక్కువగా చైనా, భారత్‌లోనే జరుగుతున్నాయని తేలింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని చెప్పక తప్పదు.
 
భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ సహా మరికొన్ని సంస్థలు నిర్వహించిన అధ్యయంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. భారతదేశంలో ప్రతి ఏటా సంభవిస్తున్న మరణాల్లో 30.7 శాతం అంటే దాదాపు 27 లక్షల మంది శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న విషతుల్యమైన గాలిని పీల్చడం ద్వారా చనిపోతున్నట్టు తేలింది. 
 
బొగ్గు, పెట్రోలు, డీజిల్ వంటి శిలా ఇంధనాల వినియోగం వల్ల వెలువడుతున్న కాలుష్యం కారణంగా 2018లో ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది చనిపోయినట్టు అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రజల ప్రాణాల్ని నిలువునా తీసేస్తున్న ఈ వాయుకాలుష్యం పలు వ్యాధులకు కారణమవుతోంది. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధులకు కారణమవుతోంది. ఈ కాలుష్య కాటుకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రతీ ఐదు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగా సంభవిస్తున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments