పని చేయని హైడ్రాలిక్ సిస్టమ్ - ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమస్య.. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:24 IST)
తిరుచ్చి విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమానం షార్జాకు వెళ్లకుండా తిరిగి తిరుచ్చికే వచ్చింది. అయితే, విమానం ల్యాండింగ్ కావడంలో సమస్య ఏర్పడింది. దీంతో విమానం గాల్లోలోనే చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
దీంతో ఎయిరిండియా విమానం గాల్లో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు అరగంట సమయం పట్టనుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ విమానం ల్యాండింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
 
అత్యవసర పరిస్థితుల్లో విమానం సురక్షిత ల్యాండింగ్‌ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే విమానం ల్యాండింగ్‌ చేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తున్న పైలట్లు.. దాదాపు గంట నుంచి గాల్లోనే చక్కర్లు కొడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

Manchu Manoj : మోహన రాగ మ్యూజిక్ తో మంచు మ‌నోజ్‌

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments