Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై సెమీ న్యూడ్‌గా ఎయిర్‌హోస్టెస్ మృతదేహం... ఎక్కడ?

ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేసే ఎయిర్‌హోస్టెస్ తెల్లారేసరికి నడి రోడ్డుపై సెమీ న్యూడ్‌ దుస్తుల్లో మృతదేహమై కనిపించింది. తన ఫ్లాట్‌లో రాత్రంతా పార్టీ ఇచ్చిన ఈమెను ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (12:19 IST)
ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేసే ఎయిర్‌హోస్టెస్ తెల్లారేసరికి నడి రోడ్డుపై సెమీ న్యూడ్‌ దుస్తుల్లో మృతదేహమై కనిపించింది. తన ఫ్లాట్‌లో రాత్రంతా పార్టీ ఇచ్చిన ఈమెను ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే అంశం మాత్రం సస్సెన్స్‌గా ఉంది. కోల్‌కతా నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కోల్‌కతా హార్బర్‌కు సమీపంలోని కెస్టోపూర్ ఏరియాలో నివశించే క్లారా ఖొంగ్ షీక్‌ అనే యువతి ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలో పని చేస్తుంది. ఈమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం అపార్ట్‌మెంట్ బయట రోడ్డుపై పడివుంది. ఈ ఎయిర్ హోస్టెస్ తన ప్లాట్‌లో రాత్రి బర్త్ డే పార్టీ ఇచ్చింది. 
 
ఈ ఇంటిని కూడా షిల్లాంగ్‌కు చెందిన క్లారా తండ్రి ఇటీవలే ఆమెకు కోల్‌కతాలో ఒక ఫ్లాట్ కొనిచ్చాడు. ఈ ఫ్లాట్‌లోనే ఆమె ఉంటోంది. ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె.. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు ఘనంగా పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, తెల్లవారుజామున పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసుకులకు క్లారా మృతదేహం రోడ్డుపై కనిపించింది. అదీ కూడా సెమీ న్యూడ్‌గా కనిపించింది. 
 
ఈ వివరాలు సేకరించిన పోలీసులు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఇద్దరు యువకులను అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్లారాను హత్యచేసి, శవాన్ని కిటికీలో నుంచి బయటకు తోసేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments