Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ - వాయుసేనకు ఇప్పటికే 60 వేలు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:53 IST)
త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆరంభంలో అనేక నిరసన కార్యక్రమాలు ఆందోళనలు జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హింసాకాండ తర్వాత ఈ ఆందోళనపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దీంతో అవి ఆగిపోయాయి. 
 
అదేసమయంలో నాలుగేళ్ళ పాటు సైన్యంలో సేవలు అందించేందుకు దేశ యువత అమిత ఉత్సాహం చూపుతోంది.  ఇందులోభాగంగా, ఈ అగ్నిపథ్ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి మూడు రోజుల్లోనే ఏకంగా 59960 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీతో ముగియనుంది. 
 
అప్పటికి లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను డిసెంబరు 11వ తేదీన ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యేడాది మాత్రం 23 యేళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. agnipathvayu.cdac.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments