Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో రాజకీయ పోరు, గెహ్లట్ సర్కారుకు చుక్కెదురు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (14:09 IST)
రాజస్థాన్‌లో రాజకీయ పోరు ఇప్పుడు కోర్టులో జరుగుతుంది. పైలట్ క్యాంపులో 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసుపై శుక్రవారం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం పైలట్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుమతిచ్చింది. ఈ విషయంలో కేంద్రాన్ని పార్టీగా చేర్చాలని పైలట్ క్యాంప్ చేసిన విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది.
 
ఈ తీర్పులో అనర్హత నోటీసుతో తిరుగుబాటు నేతలను మాజీలుగా చెయ్యాలన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయ్యింది. దీనిపై విచారణ హైకోర్టు 15 నిమిషాలు పాటు వాయిదా వేసింది. వాస్తవానికి 10వ షెడ్యూలు యొక్క రాజ్యాంగ ప్రామాణికతను తాము సవాలు చేసామని, అందువల్ల కేంద్రాన్ని పార్టీగా మార్చాలని పైలట్ గ్రూప్ హైకోర్టును కోరింది.
 
కాబట్టి కేంద్రాన్ని పార్టీగా మార్చడం అవసరమని కోర్టు పేర్కొన్నది. ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై ఈరోజు హైకోర్టు తన తుది తీర్పును వెలువరచనున్నది. ఈ తీర్పు తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు అనుకూలంగా వస్తే అశోక్ గెహ్లెట్ ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments