కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సచిన్ పైలట్‌ను శాంతింపజేసి తిరిగి పార్టీలోకి తీసుకోరావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి పి చిదంబరం, సచిన్ పైలట్‌తో ఫోన్ సంభాషణలో మాట్లాడి తిరుగుబాటును మరచిపోవాలని కోరారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తనకు తన వర్గం వారు అక్రమంగా నోటీసులు ఇచ్చారని నోటీసులకు వ్యతిరేకంగా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత సచిన్ పైలట్ చిదంబరంకు ఫోన్ చేసి పలు సలహాలు తీసుకున్నారు. తనను పీసీసీ ఛీఫ్, ఉపముఖ్యమంత్రి పద వుల నుండి తొలగించిన తర్వాత కాంగ్రెస్ కమిటీ చిదంబరంతో మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
 
									
										
								
																	
	 
	ఇదిలాఉండగా సచిన్ గౌరవంగా పార్టీలోకి రావాలని కాంగ్రెస్ వర్గాలు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.