Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా నుంచి కొత్త రకం వైరస్.. గుర్రాలు మృతి.. ఎక్కడో తెలుసా?

Webdunia
శనివారం, 23 మే 2020 (19:50 IST)
ఆఫ్రికా నుంచి కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. థాయ్‌లాండ్‌ దేశంలో ఈ వైరస్ వ్యాప్తితో వందలాది గుర్రాలు మృతి చెందుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచదేశాలను పట్టి పీడిస్తుంటే.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే వైరస్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో వ్యాప్తి చెందుతోంది. కానీ అది జంతువులకు మాత్రమే వచ్చే వైరస్ అని తేలడంతో మనుషులు ఊపిరి పీల్చుకున్నారు.
 
అసలు ఈ వైరస్ ఏంటి.? గబ్బిలాల నుంచి సోకిందా.? మనుషులకు కూడా సోకుతుందా.? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇక థాయ్‌లాండ్‌ రాజధాని అయిన బ్యాంకాక్‌లోని ఓ గుర్రాలశాలలో ఇప్పటికే 18 గుర్రాలు ఈ వైరస్ కారణంగా మృతి చెందాయి. 
 
చైనాకు కొన్ని జీబ్రాలను తీసుకెళ్ళేటప్పుడు.. వాటి నుంచి ఈ వైరస్ గుర్రాలకు సోకినట్లు కనుగొన్నారు. ఫిబ్రవరి చివరిలోనే ఈ వైరస్ బ్యాంకాక్ చుట్టుపక్కల ప్రదేశాల్లో వ్యాప్తి చెందగా.. సుమారు 500పైగా గుర్రాలు దీని వల్ల చనిపోయాయి.
 
మార్చిలో ఇంగ్లాండ్‌లో చనిపోయిన గుర్రాల రక్త నమూనాలను పరిశీలించగా.. ఇది ఆఫ్రికన్ వైరస్‌గా తేలింది. ఇది మనుషులకు హాని కలిగించే వైరస్ కాదని.. ఆఫ్రికాలోని జీబ్రాస్‌తో సహా ఈక్విన్స్‌లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments