Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే గూటికి శ్రీ ప్రియ.. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు

Webdunia
శనివారం, 10 జులై 2021 (11:10 IST)
నటుడు కమల్‌ హాసన్‌ నెలకొల్పిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ నుండి రాజీనామా చేసి డీఎంకే గూటికి వెళ్లిన నేతలపై నటి శ్రీ ప్రియ మండిపడ్డారు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారంటూ మహేంద్రన్‌ ఉద్దేశించి ఆమె విమర్శలు చేశారు.

ఇటీవల పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌...రాజీనామా చేసి డీఎంకే చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు అయిన దగ్గర నుండి శ్రీ ప్రియ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మైలాపూర్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా మక్కల్‌ నీది మయ్యం గెలుచుకోలేకపోయింది. దీంతో ఒక్కొక్కరిగా పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. 
 
ఎన్నికల్లో ఎంఎన్‌ఎం గెలుపొందని కారణంగా పార్టీ వీడుతున్న నేతలంతా.. పార్టీలు మారేందుకు వీలుగా అన్ని పార్టీల చిహ్నాలు, రంగులు ఉన్న చొక్కాలను సిద్ధంగా ఉంచుకోవాలని వ్యంగ్యాస్త్రం సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments