Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు సిఎం స్టాలిన్ పైనే సెటైర్, చిక్కుల్లో నటి కస్తూరి

Advertiesment
తమిళనాడు సిఎం స్టాలిన్ పైనే సెటైర్, చిక్కుల్లో నటి కస్తూరి
, మంగళవారం, 6 జులై 2021 (18:08 IST)
సినీనటి కస్తూరి శంకర్ గురించి చాలామందికి తెలియదు. 1992 సంవత్సరంలో మిస్ మద్రాస్ టైటిల్ విన్నర్ ఆమె. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళం భాషల్లో హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించారు.
 
ప్రెజెంట్ సీరియళ్ళలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఏకంగా తమిళనాడు సిఎం స్టాలిన్ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 
ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్‌లో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు కస్తూరి శంకర్. అయితే ఈ సీరియల్ నటి అటు సీరియల్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. 
 
సామాజిక అంశాలు, రాజకీయ విషయాలపై కామెంట్స్ చేస్తూ వివాదాస్పదమవుతుంటారు. కొన్నిసార్లు కస్తూరి శంకర్ వేసే ప్రశ్నలు విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తుంటాయట. అలాగే కొన్ని సంధర్భాల్లో ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాలకు దారితీస్తుంటాయి. 
 
ఇటీవల రజినీకాంత్ అమెరికా టూర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కస్తూరి. ఇక్కడ ఆసుపత్రులు లేవా. అమెరికాకు ఇండియన్స్ రావడానికి అనుమతి లేదు. కానీ రజినీ ఎలా వెళ్ళారంటూ ప్రశ్నించారు. రజినీకాంత్ ప్రవర్తనపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
 
తాజాగా స్టాలిన్ పైన సెటైర్లు వేశారు. స్టాలిన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా ఇండియాలో పాపులర్ అవుతున్నారు. ఉదయం పూట సైకిల్ తొక్కుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. 
 
ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా నెటిజన్లు సిఎంపై ప్రశంసలు కురిపించారు. అయితే నటి కస్తూరి కూడా సిఎం స్టాలిన్ చేస్తున్న పనిని సమర్థించారు. మరోవైపు స్టాలిన్‌కు చురకలు వేశారు. ఎం.కె.స్టాలిన్ ఒక రాక్ స్టార్, కానీ సిఎం సర్ ప్రజల్లోకి వచ్చినప్పుడు మాస్క్ ధరించడం మంచిది అంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేట‌ర్లలో వుండే అనుభూతి ఏదీ రీ ప్లేస్‌ చేయలేదుః నిర్మాత ఎస్‌కేఎన్‌