Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (09:46 IST)
తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోయానని సినీ నటి, అన్నాడీఎంకే విధాన ప్రచార ఉప కార్యదర్శి గౌతమి ఆరోపించారు. ఇటీవల సీనియర్ సినీ నటుడు సత్యరాజ్, ప్రముఖ న్యూట్రనిస్ట్ దివ్యా సత్యరాజ్ డీఎంకేలో చేరారు. దీనిపై సినీ నటి గౌతమి స్పందించారు. 
 
నటుడు సత్యరాజ్ కుమార్తె డీఎంకేలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరు ఏ పార్టీలోనైనా చేరొచ్చని, అయితే వారు ప్రజలకు ఏం చేస్తున్నారన్నదే ముఖ్యమని అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నాడీఎంకే అమలు చేసిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎంజీఆర్ తీసుకొచ్చిన పౌష్టికాహార పథకం ప్రపంచ ప్రసిద్ధి చెందిందని గౌతమి పేర్కొన్నారు. జయలలిత తన హయాంలో తాళికి తంగం, ఉచిత ల్యాప్టాప్, ద్విచక్ర వాహనాలకు రాయితీ తదితర పథకాలు అమలు చేశారని తెలిపారు. పళనిస్వామి హయాంలోనూ పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం