Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోసగాళ్లకు కౌంట్ ‌డౌన్‌స్టార్ట్ అయిందంటున్న కేటీఆర్.. ఎవరా మోసగాళ్లు?

ktrbrs

ఠాగూర్

, సోమవారం, 4 నవంబరు 2024 (09:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ నేతలను మోసగాళ్ళతో ఆయన పోల్చారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వచ్చ నెలకు యేడాది పూర్తవుతుందని ఆయన గుర్తుచేశారు. గత యేడాది జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీలను కూడా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. ఈ యేడాదికి ఇంకా 35 రోజులు మాత్రమే మిగిలివున్నాయని, ఈ హామీల అమలు ఎపుడంటూ ఆయన ప్రశ్నించారు. పైగా, మోసగాళ్లకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చేసిన పోస్ట్‌లో అనేక అంశాలను ప్రస్తావించారు. 
 
వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ 
మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది!
ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది  -2 లక్షల జాబ్ లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు
ఏడాదికి 35 రోజులే మిగిలింది - ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు 
ఏడాదికి 35 రోజులే మిగిలింది - పెంచిన రూ.4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది - నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది - పెంచి ఇస్తామన్న రూ.6,000 పెన్షన్ ఎక్కడని నిలదీస్తున్నారు దివ్యంగా అన్నలు, అక్కలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది - ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు 
ఏడాదికి 35 రోజులే మిగిలింది - కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ.12000 ఎక్కడ అంటున్నారు
ఏడాదికి 35 రోజులే మిగిలింది - తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు
చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే - చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే
ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్‌తో పబ్బం గడిపిన మూసి సర్కార్
ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు, రాస్తారోకోలు తప్ప? 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్.. నలుగురు మృతి