Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహదేవ్ బెట్టింగ్ యాప్ : బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (10:11 IST)
మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్ కేసులో బాలీవుడ్‌ నటుడు, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహిల్‌ ఖాన్‌‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ విభాగానికి చెందిన 'ప్రత్యేక దర్యాప్తు బృందం' ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో కస్టడీలోకి తీసుకుంది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
 
సాహిల్‌కు సిట్‌ 2023 డిసెంబరులోనే సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం యాప్‌నకు బ్రాండ్‌ ప్రమోటర్‌గా మాత్రమే పనిచేశానని చెప్పుకొచ్చారు. 
 
ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. యాప్‌ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, పోలీసులు మాత్రం ఆయన్ని బెట్టింగ్‌ యాప్‌ సహ-యజమానిగా చెబుతున్నారు.
 
సాహిల్‌ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు బెయిల్‌ను నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 'బెట్టింగ్‌ యాప్‌' కార్యకలాపాలన్నీ అక్రమం. చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారింది. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించారు. ఫేక్‌ సిమ్‌ కార్డులతో సంప్రదింపులు జరిపారు. పిటిషన్‌దారుకు 'ది లయన్‌ బుక్‌247'తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలింది' అని ధర్మాసనం పేర్కొంది.
 
పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన సాహిల్‌ ‘స్టైల్‌’, ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. సొంతంగా ఓ కంపెనీని స్థాపించి ఫిట్‌నెస్‌ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments