Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నిక ప్రచారానికి సిద్ధమవుతున్న హీరో విక్టరీ వెంకటేష్!

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (10:03 IST)
హీరో విక్టరీ వెంకటేష్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వెంకటేష్ ప్రచారం చేయడం దాదాపు ఖరారైంది. ఆయన ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు, తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. అయితే రెండు వేర్వేరు పార్టీలకు ఆయన తన మద్దతు తెలపడం ఇక్కడ విశేషం. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామి రెడ్డి పోటీలో నిలబడ్డారు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు రామసహాయం రఘురామి రెడ్డి స్వయానా మామ. ఆయన అబ్బాయి వినాయక్ రెడ్డిని వెంకటేష్ కుమార్తె పెళ్లి చేసుకున్నారు. వియ్యంకుడి కోసం ఖమ్మం లోక్సభ పరిధిలో వెంకటేష్ ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. 
 
అలాగే, ఏపీలో కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. వెంకటేష్ భార్య నీరజకు కామినేని శ్రీనివాస్ స్వయానా మేనమామ. అందుకోసం ఆయన తరపున ప్రచారం చేయడానికి వెంకటేష్ ముందుకొచ్చారు. తెలంగాణాలోని ఖమ్మంలో వియ్యంకుడు రామసహాయం రఘురామి రెడ్డికి మద్దతుగా ఏపీలోని కైకలూరులో భార్య మేనమామ కామినేని శ్రీనివాస్ కోసం వెంకటేష్ ప్రచారం చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments