Webdunia - Bharat's app for daily news and videos

Install App

11% మందికి ఏదో ఒక వ్యాధి, 35 ఏండ్లు దాటగానే సోకుతున్న వైనం

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (20:21 IST)
దేశంలో ప్రతి వెయ్యి మందిలో 116 మంది (11.6శాతం) ఏదో ఒక అసాంక్రమిక వ్యాధులతో బాధపడుతున్నారు. 35 ఏండ్లు పైబడిన తర్వాత ఈ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరగడానికి ప్రధాన కారణం గాలి కాలుష్యం.
 
అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశం-అసాంక్రమిక వ్యాధుల భారం’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైపర్‌టెన్షన్‌, జీర్ణకోశ వ్యాధులు, మధుమేహంతో ఎక్కువమంది బాధపడతున్నారు. ఈ వ్యాధులతో పోల్చితే క్యాన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య తక్కువగా ఉంది.
 
21 రాష్ట్రాల్లో 2,33,672 మందిపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు 26-59 ఏండ్ల లోపు వారే. వాయు కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, సమతులాహారం తీసుకోకపోవడం, జీవన శైలిలో మార్పులు అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments