Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 వేల ట్రై సైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్

Advertiesment
14 వేల ట్రై సైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్
, మంగళవారం, 13 జులై 2021 (20:12 IST)
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీఎం జగన్ గ్రామాల్లో 14 వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా..మాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్‌ అంగీకారం తెలియజేశారు.
 
అంతేకాదు..అర్బన్‌ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటుతో పాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రూరల్‌ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వెట్‌ వేస్టేజ్‌ ఉంటే దాన్ని తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు ఏడాదిలోగా పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు.
 
ఒక ప్రత్యేక నంబర్‌ను గ్రామాల్లో డిస్‌ప్లే చేయాలని, దానికి కాల్‌ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వేస్టేజ్‌ సేకరించి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించాలని అధికారులకు సూచించారు. అపరిశుభ్రత, దోమలవల్ల రోగాలు వస్తున్నాయని అలాంటి పరిస్థితులను నివారించాలన్నారు. 
 
బలోపేతమైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుందని.. వైయస్సార్‌ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని ఈ సందర్బంగా జగన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు లక్షలమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడును బీజేపీ రెండు రాష్ట్రాలుగా విడగొట్టబోతోందంటూ ప్రచారం: కనిమొళి స్పందన