విమానం ఎక్కాలనుకునేవారు ఇది ఓసారి చూడాల్సిందే

Webdunia
గురువారం, 21 మే 2020 (17:45 IST)
కొవిడ్-19 కారణంగా భారత్‌లో అన్ని రవాణా సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అయితే దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు ప్రజారవాణాకు అనుమతి లభించడంతో రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి, అలాగే దేశీయంగా నడిచే విమానాలు కూడా గాలిలోకి ఎగరనున్నాయి.

కాగా ఆరోగ్యసేతు యాప్‌లో మీ స్టేటస్ చాలా ముఖ్యం. ఒకవేళ అందులో రెడ్ స్టేటస్ చూపినట్లయితే, అప్పుడు మీరు విమానంలో ప్రయాణించలేరు. ఆరోగ్య‌సేతులో రెడ్ స్టాట‌స్ ఉన్న‌వారిని విమాన ప్ర‌యాణానికి అనుమ‌తించ‌మ‌ని విమాన‌యాన‌శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పూరి తెలిపారు.
 
మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు మంత్రి ప్రకటించారు. మెట్రో నుంచి మెట్రో న‌గ‌రాల‌కు మూడ‌వ వంతు సామ‌ర్థ్యంతో విమాన స‌ర్వీసులు న‌డ‌పనున్న‌ట్లు తెలిపారు. ఆ ప్రకారం ప్ర‌యాణికుల శాతం 33.33 క‌న్నా ఎక్కువే ఉంటుంది. విమాన ప్ర‌యాణికులు తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గియ‌ర్‌, ఫేస్ మాస్క్‌, శానిటైజ‌ర్ బాటిల్‌ను తీసుకెళ్లాలన్నారు. 
 
ఎయిర్‌లైన్స్ ఎలాంటి మీల్స్ ఏర్పాటు చేయ‌ద‌న్నారు. అలాగే గ్యాల‌రీలో, విమాన సీట్ల‌లో వాట‌ర్ బాటిల్స్ ఉంటాయ‌న్నారు. విమాన ఛార్జీల ధ‌ర‌ల్లో మార్పు ఉంటుంద‌న్నారు. క‌నీస ధ‌ర రూ.3500, గ‌రిష్ట ధ‌ర 10 వేలుగా ఉంటుందని నిర్ధారించారు. ఆగ‌స్టు 24 అర్థ‌రాత్రి వర‌కు ఈ ఛార్జీలు అమ‌లులో ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments