ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (14:31 IST)
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆధార్‌ కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండానే ఇంటి వద్దే మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసే సౌకర్యాన్ని తీసుకొస్తోంది. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు ఉడాయ్‌ తన ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.
 
ఆధార్‌ మొబైల్‌ నంబర్‌ అప్‌డేషన్‌కు ప్రస్తుతం వ్యక్తిగతంగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిందే. చిన్నపనే అయినా ఆధార్‌ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో నిల్చోవాల్సిందే. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి చెక్‌ పెడుతూ ఉడాయ్‌ తన ఆధార్‌ యాప్‌లో కొత్త సదుపాయం తీసుకొస్తోంది. ఓటీపీ, ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌ కలిపి ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. 
 
మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేసి, ఆ తర్వాత కెమెరా ద్వారా ముఖాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తద్వారా మొబైల్‌ అప్‌డేషన్‌ను సులువుగా పూర్తి చేయొచ్చు. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని ఉడాయ్‌ తెలిపింది. ఇందుకోసం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన వారు ఫీడ్‌బ్యాక్‌ను తమతో పంచుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments