Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా వైద్యురాలి గొంతు కోసి హత్య... 29 ఏళ్ల వైద్యుడే సర్జికల్ నైఫ్‌తో...

Webdunia
గురువారం, 2 మే 2019 (16:39 IST)
ఢిల్లీలోని రంజిత్ నగర్ లోని ఓ అపార్టుమెంట్లో 25 ఏళ్ల మహిళా వైద్యురాలు హత్యకు గురైంది. ఆమె శరీరంపై కత్తి గాట్లతో పాటు గొంతు కోసినట్లు వుంది. రక్తపు మడుగులో పడి వున్న ఆమె దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కరోల్ బాగ్ లోని ప్రభుత్వాసుపత్రిలో ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కి చెందిన 25 ఏళ్ల గరీమ మిశ్రాతో పాటు 29 ఏళ్ల చంద్రప్రకాష్ వర్మతో పాటు మరో వైద్యుడు కలిసి ఒకే అపార్టుమెంట్లో వేర్వేరు గదుల్లో అద్దెకు వుంటున్నారు. ఐతే మే 1వ తేదీ ఉదయం గరీమా నివాసముంటున్న అద్దె గది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పనివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా లోపల ఆమె మృతదేహం రక్తపుమడుగులో పడి వుంది. ఆమె దేహంపై పదునైన కత్తిగాట్లు వున్నాయి. ఐతే ఆమెతో పాటుగా వుంటున్న 29 ఏళ్ల వైద్యుడు వర్మ కనిపించకపోవడంతో అతడే హత్య చేసి పరారై వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి వుంటాడేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments