Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడికి 24 ఆమెకి 42 ఏళ్లు, ఇక శృంగార బంధం వద్దన్నందుకు ఆమె గొంతులో పొడిచాడు

Webdunia
గురువారం, 15 జులై 2021 (22:25 IST)
పని చేసుకుంటూ భర్త వెంట వస్తున్న 19 ఏళ్ల యువకుడిపై 37 ఏళ్ల మహిళ మోజు పడింది. ఆమె భర్త లేని సమయంలో ఆ యువకుడితో తన సంబంధాన్ని కొనసాగించింది. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. అనారోగ్యంతో ఆమె భర్త మృతి చెందాడు. ఆ యువకుడు భర్తతో కలిసి వచ్చినప్పుడు జనం ఏమీ అనుకోరు కానీ లేనప్పుడు వస్తే నానావిధాలుగా అనుకుంటారనీ, పైగా తనకు పెళ్లీడుకొచ్చిన 17 ఏళ్ల కుమార్తె కూడా వుండటంతో ఇక అతడిని తన ఇంటికి రావద్దని చెప్పేసింది. 
 
అంతే అతడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీలో చోటుచేసుకున్న వివరాలు ఇలా వున్నాయి. 24 ఏళ్ల కృష్ణ తనను దూరం పెడుతున్న 42 ఏళ్ల మహిళ వద్దకు జూన్ 10న సాయంత్రం పూట వెళ్లాడు. ఆమెతో తనను దూరం పెట్టడంపై వాగ్వాదానికి దిగాడు. ఆమె ససేమిరా అతడిని అంగీకరించకపోవడంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. దీనితో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
 
మధ్యాహ్నం తన అత్తను చూడటానికి వెళ్ళిన మహిళ యొక్క 17 ఏళ్ల కుమార్తె, సాయంత్రం పూట ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఆమె తల్లి చనిపోయినట్లు గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్యానా నివాసి అయిన నిందితుడు కృష్ణను జూలై 12న అరెస్టు చేసి అతనిపై హత్య కేసు నమోదు చేశారు. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments