Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రయిక్స్‌ ఎలా జరిగాయో తెరపై చూడొచ్చు..? సినిమా వచ్చేస్తోంది...

సర్జికల్స్ స్ట్రయిక్స్‌కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం.. మిలటరీ స్థావరంపై ఉగ్రమూకల దాడికి సరైన సమాధానం ఇవ్వాలని భారత్ భావించింది. ఈ క్రమంలో గత ఏ

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:31 IST)
సర్జికల్స్ స్ట్రయిక్స్‌కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం.. మిలటరీ స్థావరంపై ఉగ్రమూకల దాడికి సరైన సమాధానం ఇవ్వాలని భారత్ భావించింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి.
 
గత ఏడాది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్‌ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు లభించింది. ఈ దాడులు నిర్వహించి నిన్నటికి అంటే సెప్టెంబర్‌ 28 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఢిల్లీలో రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. అంతేగాకుండా సర్జికల్ స్ట్రయిక్స్ ఎలా జరిగాయనే దృశ్యాలను కళ్లకు కట్టే విధంగా సినిమా కూడా రాబోతోంది.
 
సర్జికల్ స్ట్రయిక్స్‌పై ''ఉడీ'' పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి అధియా ధార్‌ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. సర్జికల్ స్ట్రయిక్స్ టీమ్‌కి నాయకత్వం వహించిన కమాండర్‌గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments