వ్రిస్ట్ వాచ్ ఆర్డర్ చేస్తే.. పిడకలు వచ్చాయ్.. షాకైన మహిళ

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:19 IST)
ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఏదైనా ఆర్డర్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ విధంగానే ఓ మహిళ వాచ్ ఆర్డర్ చేశాడు. తీరా ఇంటికి పార్శిల్ వచ్చాక.. దాన్ని చూసి షాకైంది. ఇలా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కాసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన రూ. 1304 విలువ చేసే ఓ వాచ్‌ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. 
 
సరిగ్గా తొమ్మిది రోజులు.. అనగా అక్టోబర్ 7వ తేదీన ఆ ఆర్డర్ ఇంటికొచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాచ్‌కు బదులు పిడకలు వచ్చాయి. వాటిని చూసి నీలం యాదవ్, ఆమె సోదరుడు రవీంద్ర షాకయ్యారు. 
 
ఆ తర్వాత ఇద్దరూ తేరుకుని.. డెలివరీ బాయ్‌ను చేజ్ చేసి పట్టుకోగా.. అతడు డబ్బును తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఆ పిడకలను తిరిగి తీసుకున్నాడు. ఇలాంటివి కొత్తేమీకాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments