Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 17 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హెమచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఇంజనీరింగ్ ప్రక్రియ మొత్తం వచ్చే 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. 
 
ఆయన వివిధ సెట్ల కౌన్సెలింగ్ వివరాలను ఆయన సోమవారం మంగళగిరిలోని మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, ఐ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, పీజీ సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 27 నుంచి నవంబరు 3వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 
 
అయితే, డిగ్రీ విద్యార్థులకు ఈ యేడాది నుంచి రెండు నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందని, ఇందులో కొందరికి వర్చ్యువల్, మరికొందరికి ఆఫ్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్ అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అదేసమయంలో ఈ నెల 15వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments