Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం 13 ఏళ్ల బాలికతో లేచిపోయి వచ్చిన వివాహిత, కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (20:44 IST)
ప్రియుడితో అక్రమ సంబంధం సాగిస్తున్న వివాహిత అతడి కోసం భర్తను వదిలేసింది. తన 13 ఏళ్ల కుమార్తెను తీసుకుని ప్రియుడి ఇంట్లో కాపురం పెట్టింది. ఐతే ఆ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేసాడు.
 
పూర్తి వివరాలు చూస్తే... తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా దేవందవాక్కం గ్రామానికి చెందిన 50 ఏళ్ల చరణ్ రాజ్ బస్సు డ్రైవరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడి వద్ద కుప్పుస్వామి అనే 45 ఏళ్ల వ్యక్తి క్లీనర్‌గా వున్నాడు. ఈ క్రమంలో చరణ్ రాజ్ కుప్పుస్వామి ఇంటికి వెళ్లాడు. అక్కడ కుప్పుస్వామి భార్యపై కన్నేసాడు. కొన్నిరోజులకు ఆమెను లొంగదీసుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
విషయం తెలిసిన కుప్పుస్వామి భార్యతో గొడవపడ్డాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో కుప్పుస్వామి భార్య కోమది భర్తను వదిలేసి తన 13 ఏళ్ల బాలికను తీసుకుని డ్రైవర్ చరణ్ రాజ్ వద్దకు వెళ్లింది. అతడు ఆమెను పెద్దకుప్పంలో అద్దె ఇంట్లో పెట్టి సంబంధం కొనసాగించాడు. ఐతే కోమది ఇంట్లో లేని సమయంలో బాలికపై అత్యాచారం చేసాడు.
 
చెబితే చంపేస్తానని బెదిరిస్తూ పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనితో బాలిక గర్భవతి అయ్యింది. వాంతులు చేసుకోవడంతో తల్లి నిలదీసింది. విషయం చెప్పడంతో కోమది పోలీసులను ఆశ్రయంచింది. ఈ విషయం తెలుసుకున్న చరణ్ రాజ్ పరారయ్యాడు. చివరికి అతడు తిరువణ్ణామలైలో వున్నట్లు కనుగొన్న పోలీసులు అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం