Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు లేచిపోదామంటూ ఒత్తిడి చేస్తుందని సూసైడ్ చేసుకున్న వివాహితుడు

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (18:59 IST)
అతనికే అప్పటికే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. హాయిగా సాగిపోతున్న సంసారం. హోటల్ యజమాని. బాగానే డబ్బులు సంపాదిస్తూ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడుపుతున్నాడు. అయితే ఒక యువతి కారణంగా అతని కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్త అతని జీవితాన్ని సర్వనాశనం చేసింది.
 
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు నగరంలోని ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న నాగరాజు స్థానికంగా హోటల్ నడుపుతున్నాడు. డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. పనిచేసే వారు కూడా ఎక్కువమందే ఉన్నారు. అందులో వంట పని చేసే మహిళ కుమార్తె గౌరమ్మతో నాగరాజుకు పరిచయం పెరిగింది.
 
నాగరాజు అంటే గౌరమ్మ ఇష్టం పెంచుకుంది. అతనికి దగ్గరైంది. అతని నుంచి శారీరక సంబంధం కోరుకుంది. పెళ్ళయి, పిల్లలున్నారని తెలిసినా అతనే కావాలనుకుంది. ఇదే చివరకు నాగరాజు కుటుంబంలో విభేదాలకు కారణమైంది. నాగరాజు భార్యకు తెలియడంతో గొడవకు దిగింది.
 
ఆ గొడవ కాస్త పెద్దదైంది. తనను ఎక్కడికైనా తీసుకెళ్ళమని.. నువ్వు లేని జీవితం వద్దంటూ డైలాగులతో నాగరాజును ఇబ్బంది పెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇద్దరికీ ఏమీ చెప్పలేక సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు నాగరాజు. ఆత్మహత్యకు ముందు జరిగిన విషయాలను సెల్ఫీ వీడియో తీసి మరీ సేవ్ చేశాడు. పోలీసులు ఆ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments