తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను మోసం చేసిన కేటీఆర్‌ను నడిరోడ్డులో ఉరితీయాలన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ఉద్యోగం రావడం లేదన్న బెంగతో కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండేంగ తేజవత్‌రామ్‌సింగ్ తండాకు చెందిన కేయూ విద్యార్థి బోడ సునీల్‌నాయక్ (28) పురుగుల ముందు తాగి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్రస్తుత అతను ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థి సునీల్‌ను తీన్మార్ మల్లన్న పరామర్శించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యోగం పోగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
సునీల్‌ను వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి మంచి వైద్యం అందించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. స్నేహితులు వెంటనే సునీల్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సునీల్‌ను విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు పరామర్శిస్తున్నారు.
వైఎస్ షర్మిల అనుచరులు పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్క వస్తోంది.. అన్ని కష్టాలు తీరుతాయి అని సునీల్‌కు షర్మిల అనుచరులు భరోసాను షర్మిల మద్దతుదారులు ఇచ్చినట్టు సమాచారం.