అత్తింటివారు వేధిస్తున్నారు.. గృహ హింస చట్టంలో మార్పులు చేయాలి..

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (10:56 IST)
తమను కట్టుకున్న భార్యలతో పాటు అత్తింటివారు వేధిస్తున్నారని అందువల్ల తమకు రక్షణ కల్పించేలా గృహహింస చట్టంలో మార్పులు చేయాలని భార్యా బాధితుల సంఘం (భర్తలు) కోరుతున్నారు. గృహ హింస చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమ భార్యలు, అత్తింటివారు వేధిస్తున్నారంటూ వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల గృహ హింస చట్టంలో తక్షణం మార్పులు చేయాలని వారు కోరారు. 
 
ఈ మేరకు సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు ఆదివారం కర్నాటక రాజధాని బెంగుళూరులో నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్  చేశారు. లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని భార్యా బాధితుల సంఘం తెలిపింది.
 
గృహహింస చట్టాన్ని ఉపయోగించిన కొందరు మహిళలు ఎన్నారై భర్తలను, వారి కుటుంబసభ్యులను వేధిస్తున్నారని భార్యా బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. గృహ హింస కేసులను ఎదుర్కొంటున్న ఎన్నారైల కోసం ప్రత్యేక ప్యాయస్థానాలు ఏర్పాటుచేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments