Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (10:26 IST)
ఈ మధ్య కాలంలో వ్యాయామాలు చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువై పోతుంది. దీనికి సంబంధించిన వీడియోలు అపుడపుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వ్యాయామం చేసి జిమ్ నుంటి బయటకు వచ్చిన ఓ యువకుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా ఆదోనీకి చెంది 28 యేళ్ల యువకుడు హైదరాబాద్ నగరంలో టెక్కీగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యం ఉండటంతో ఇంటి పట్టునుంచే విధులు నిర్వహిస్తున్నాడు. పైగా, ఇటీవలే అతనికి పెళ్లి కూడా కుదిరింది. శనివారం ఉదయం పట్టణంలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. 
 
అక్కడ వ్యాయామం చేస్తుండగా, కళ్లు తిరుగుతున్నట్టుగా అనిపించడంతో స్నేహితుడితో కలిసి జిమ్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత నీళ్లు తెచ్చేందుకు స్నేహితుడు వెళ్లాడు. అదే సమయంలో మార్ఛవచ్చి ప్రాణాలు విడిచాడు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు యువకుడికి చేసిన సాయం కూడా ఫలితంలేకుండా పోయింది. ఆ వెంటనే ఆయన్ను పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments