Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్-3 - కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు ఫలించేనా...

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (12:11 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక ఘట్టానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుంది. ఈ అరుదైన క్షణాల కోసం యావత్ భారత ప్రజలతో పాటు ప్రపంచం ఉత్కంఠతగా ఎదురు చూస్తుంది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై అడుగుపెట్టాలని కోట్లాది మంది ఉత్కంఠతతో వీక్షిస్తున్నారు. 
 
రష్యా పంపించిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్‌తో పాటు చంద్రయాన్-2 ప్రాజెక్టు చివరి క్షణంలో విఫలంకావడంతో 'ఆ 20 నిమిషాల'పై దేశవిదేశాల్లోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. చివరి 20 నిమిషాల టెర్రర్‌ను జయించి విక్రమ్ ల్యాండర్ క్షేమంగా జాబిల్లిని ముద్దాడాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇస్రోకు అభినందనలు, ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతం కావాలని పూజలు జరుగుతున్నాయి. భారతీయులతో పాటు ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుపైనే కేంద్రీకృతమైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్షేమంగా దిగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
2019లో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రాజెక్టు వైఫల్యం తర్వాత కారణాలను విశ్లేషించి, అప్పుడు జరిగిన పొరపాట్లకు మళ్లీ తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. ఈసారి ఖచ్చితంగా జాబిల్లిని ముద్దాడి చరిత్ర సృష్టిస్తామన్నారు. సాయంత్రం 5:20 గంటలకు ఇస్రో వెబ్ సైట్‌తో పాటు ఇస్రో యూట్యూబ్ చానెల్, డీడీ నేషనల్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత క్షణాన్ని చూసేందుకు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments