Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌బ‌రిమ‌ల‌కు 98 ప్ర‌త్యేక‌ రైళ్లు... ఆదివారం నుంచి రిజర్వేషన్ అందుబాటులోకి...

శ‌బ‌రిమల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. భ‌క్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ‌మధ్య రైల్వే 98 ప్ర‌త్యేక రైళ్ల‌ను నడపనుంది. ఈ రైళ్ల‌లో ఆదివారం నుంచే భ‌క్తులకు రిజ‌ర్వేష‌న్లు అందుబాటులో రానున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, వి

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (13:46 IST)
శ‌బ‌రిమల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. భ‌క్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ‌మధ్య రైల్వే 98 ప్ర‌త్యేక రైళ్ల‌ను నడపనుంది. ఈ రైళ్ల‌లో ఆదివారం నుంచే భ‌క్తులకు రిజ‌ర్వేష‌న్లు అందుబాటులో రానున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, విజయవాడ, కాకినాడ‌, న‌ర్సాపూర్‌, కరీంనగర్, మ‌చిలీప‌ట్నం, సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌,  ఔరంగాబాద్‌, అకోలా, తిరుప‌తి, ఆదిలాబాద్‌, కొల్లాం నుంచి ప్ర‌త్యేక రైళ్లు న‌డుస్తాయ‌ని వివరించింది. 
 
శ‌బ‌రిమ‌ల వెళ్లే భ‌క్తులు తిరుగు ప్ర‌యాణంలో తిరుప‌తిని కూడా ద‌ర్శించుకుంటారు కాబ‌ట్టి వారి కోసం తిరుప‌తి-అకోలా, తిరుప‌తి-ఆదిలాబాద్ మ‌ధ్య‌ వ‌చ్చే నెల 6వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 18 వ‌ర‌కు ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌ప‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక రైళ్ల‌కు ఆదివారం నుంచి రిజ‌ర్వేష‌న్లు ప్రారంభం కానున్న‌ట్టు తెలిపారు. రైళ్ల షెడ్యూల్ కోసం ద‌క్షిణమ‌ధ్య రైల్వే వెబ్‌సైట్‌లో కానీ సమాచార విభాగం నంబ‌రుకు కానీ ఫోన్ చేసి తెలుసుకోవ‌చ్చ‌ని రైల్వే అధికారులు సూచించారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments