Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్‌లో లింకుల్ని షేర్ చేస్తున్నారా? కాస్త ఆగండి గురూ.. హ్యాకర్లున్నారు జాగ్రత్త...

వాట్సప్‌లో గంటల పాటు గడుపుతున్నారా? అలా ఇతరులు షేర్ చేసే లింకుల్ని ఓపెన్ చేయడం.. వాటిని ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తపడాల్సిందే అంటున్నారు నిపుణులు. సోషల్ మీడియా సైట్లు ముఖ్యంగా వాట్సప్‌

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (13:44 IST)
వాట్సప్‌లో గంటల పాటు గడుపుతున్నారా? అలా ఇతరులు షేర్ చేసే లింకుల్ని ఓపెన్ చేయడం.. వాటిని ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తపడాల్సిందే అంటున్నారు నిపుణులు. సోషల్ మీడియా సైట్లు ముఖ్యంగా వాట్సప్‌పై హ్యాకర్లు కన్నేసి వుంచుతున్నారని.. చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి.. డేటాను కాజేస్తున్నారని ద సన్ పత్రిక కథనంలో వెల్లడించింది. 
 
వాట్సప్‌లో వీడియోలు పంపి.. ఆఫర్లు ఇస్తామని ఊదరగొడుతున్నారని.. అలాంటి లింకులు ఓపెన్ చేస్తే మాత్రం సైబర్ దాడుల బారిన పడటం ఖాయమేనని ద సన్ పత్రికలో ప్రచురితమైన కథనం ద్వారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేసి, సులభంగా వారిని బుట్టలో పడేసేందుకు హ్యాకర్లు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారని వారు చెప్తున్నారు. సాధారణంగా వాట్సప్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఈ మధ్యనే వచ్చింది. నిజానికి గూగుల్ ప్లేస్టోర్‌లో వాట్సప్ అపడేట్ చేసుకుంటే చాలు. ఈ వీడియో కాల్స్ వచ్చేస్తున్నాయి. 
 
కానీ, చాలామంది దానికి సంబంధించి ఓ లింకును విపరీతంగా ఫార్వర్డ్ చేశారు. పొరపాటున అలాంటి లింకులను ఓపెన్ చేస్తే వెంటనే మన ఫోన్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. తద్వారా ఫోన్‌లో భద్రపరిచిన డేటా మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకు లింకులు షేర్ చేసేటప్పుడు.. వచ్చే లింకుల్ని ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments