Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ... ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఎస్ఐ శ్రీధర్ సూసైడ్...?

తన ప్రేమ పెళ్లికి ఇంట్లో వారు అంగీకరించడం లేదనే ఆవేదనతో వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన ఎస్ఐ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బందోబస్తుకు విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఎస్ఐ హఠాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్త

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (13:35 IST)
తన ప్రేమ పెళ్లికి ఇంట్లో వారు అంగీకరించడం లేదనే ఆవేదనతో వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన ఎస్ఐ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బందోబస్తుకు విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఎస్ఐ హఠాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కాగా ఎస్ఐ ఆత్మహత్యకు కారణం ప్రేమేనా లేదంటే మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. 
 
అతడి స్నేహితుడు ఇచ్చిన వివరాల ప్రకారం అది ప్రేమ పెళ్లికి ఒప్పుకోనందువల్లనే జరిగిన ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. శ్రీధర్ స్నేహితుడు సందీప్ అనే హోంగార్డు చెప్పిన విషయాలను చూస్తే... గత రాత్రి కూడా శ్రీధర్ తను చనిపోవాలనుకుంటున్నట్లు తనతో చెప్పాడని వెల్లడించారు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడేందుకు ఇంట్లో అంగీకరించడం లేదనీ, అందువల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని తెలియజేశాడు. ఐతే తను వారించడంతో నిన్న ఆ పని చేసుకోలేదనీ, ఇంతలో మళ్లీ అతడు ప్రాణాలను తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
కాగా శ్రీధర్ మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై 174వ నెంబరు పిల్లరు వద్ద ఉప్పర్‌పల్లి సమీపంలో శ్రీధర్‌ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ కారణంగానే గతంలో డ్యూటీ కూడా సరిగా చేయలేదని అతడిపై విమర్శలు కూడా ఉన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments