Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది నెలల పసికందును బలి తీసుకున్న కరోనా

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (19:27 IST)
కరోనా మహమ్మారి తొమ్మిది నెలల పసికందును బలి తీసుకుంది. ఈ విషాధ ఘటన ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటుచేసుకుంది. శ‌శాంక్ శేఖ‌ర్‌(26), ఆయ‌న భార్య ఇద్ద‌రూ అంధులే. 
 
అయితే వీరికి తొమ్మిది నెల‌ల ప‌సి బాలుడు ఉన్నాడు. 18 రోజుల క్రితం త‌ల్లికి క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్ బిడ్డ‌కు కూడా వ్యాపించింది. దీంతో ఇద్ద‌రిని గురు తేగ్ బ‌హ‌దూర్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ ప‌సిపాప చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం క‌న్నుమూశాడు. 
 
తండ్రి శేఖ‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ‌గా, రాజీవ్ గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. కొడుకు మ‌ర‌ణించాడ‌న్న వార్త శేఖ‌ర్‌కు తెలియ‌దు. ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు క‌రోనాతో పోరాడుతున్నారు. ప‌సిపాప అంత్య‌క్రియ‌ల‌ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద‌ర్ సింగ్ నిర్వ‌హించారు.

సంబంధిత వార్తలు

ప్రభాస్-అనుష్క పెళ్లి.. ఇష్టపడితే వద్దంటామా.. శ్యామలా దేవి

హారర్, కామెడీ తో ఓ మంచి ఘోస్ట్ రాబోతుంది

న్యూ లుక్ తో వరుణ్ తేజ్..మట్కా తాజా షెడ్యూల్ జూన్ 19 నుంచి ప్రారంభం

భారతీయుడు 2 నుంచి తాత వస్తాడే సాంగ్ ప్రోమో విడుదల

8 వసంతాలు చిత్రంలో శుద్ధి అయోధ్యగా అనంతిక సనీల్‌కుమార్‌

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?

తర్వాతి కథనం
Show comments