Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‍లో లోయలో పడిన కారు - 9 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (08:50 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సెంట్రల్ కాశ్మీర్‌లో ఘోరం జరిగింది. ఓ కారు లోయలో పడిన ఘటనలో మొత్తం 9 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్‌లోని కార్గిల్ నగరం నుండి శ్రీనగర్ వైపు వెళుతున్న కారు ఒకటి గంధర్‌పాల్ జిల్లా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారికి వెళుతుండగా ఆ కారు నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న భారీ లోయలోకి దూసుకెళ్లింది. 
 
దీంతో అందులో ప్రయాణిసున్న వారిలో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ప్రయాణికులతో కూడిన కారు కార్గిల్ నుంచి సోనామార్గ్‌కు వెళ్తుండగా రాత్రి రోడ్డుపై నుంచి జారిపడి 400 అడుగుల మేర బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతుల మృతదేహాలను వెలికితీసి గుర్తించారు. మృతి చెందిన వారిలో గుజరాత్, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన సందర్శకులు ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments