Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఒకేసారి 89 మంది వైద్యులు రాజీనామా..ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (20:34 IST)
మహారాష్ట్రలో యవత్మల్‌ జిల్లా కలెక్టర్‌ ఎండి. సింగ్‌ వైఖరికి నిరసనగా 89 మంది వైద్యులు ఒక్కసారిగా రాజీనామాలు చేశారు. తమతో అమర్యాదగా ప్రవర్తించిన కలెక్టర్‌ను బదిలీ చేసేంతవరకు తాము విధులకు హాజరుకామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మెడికల్‌ అసోసియేషన్‌ ధ్రువీకరించింది.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వైద్యులు, వారి బంధువుల కోసం ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 50 బెడ్‌లను రిజర్వ్‌ చేయాలని డిమాండ్‌ చేసేందుకు తమ ప్రతినిధి కలెక్టర్‌ వద్దకు వెళ్లారని మహారాష్ట్ర స్టేట్‌ గెజిటెడ్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌ గ్రూప్‌ ఆర్‌గనైజేషన్‌ (ఎంఎజిఎంఒ) యవత్మల్‌ యూనిట్‌ కార్యదర్శి డా.సంఘర్ష్‌ రాథోడ్‌ తెలిపారు.

అలాగే వారంలో ఒక రోజు సెలవు ఇప్పించాలని, ప్రతిరోజూ నివేదికలు సమర్పించేందుకు కాల పరిమితిని కల్పించాలని కోరారు. అయితే సింగ్‌ వారి సమస్యలు పట్టించుకోకుండా నివేదిక సమర్పించలేదంటూ వైద్యులను దూషించడంతో పాటు అమర్యాదగా ప్రవర్తించారని అన్నారు.

దీంతో వైద్యులు ఆయన తీరుకు నిరసనగా యవత్మల్‌ జిల్లా పరిషద్‌ సిఇఒకు తమ రాజీనామాలను సమర్పించారని అన్నారు. ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments