Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 8వేల మార్కును దాటిన కరోనా కేసులు.. రైళ్లు వద్దు సార్..

Webdunia
సోమవారం, 11 మే 2020 (20:21 IST)
తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సోమవారం కొత్తగా మరో 798 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 వేల మార్కును దాటి 8,002కు చేరింది.

ఇక సోమవారం కొత్తగా మరో ఆరుగురు కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 53కు చేరింది. మొత్తం కేసులలో 2,051 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 5,895 మంది వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళనాడు సీఎం పళనిసామి కీలక సూచన చేశారు. తమిళనాడు రాష్ట్రానికి మే 31 వరకు రైళ్లు నడపవద్దని, రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తిచేశారు. ఇంకా విమాన రాకపోకలకు కూడా అనుమతి ఇవ్వవద్దని కోరారు.

ఇలా చేయడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను తగ్గించవచ్చునని.. కొత్త కేసులు నమోదు కావన్నారు. ఇక ప్రధాని కూడా పళనిసామి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments