Webdunia - Bharat's app for daily news and videos

Install App

90 శాతం కేసులు ఆ 8 రాష్ట్రాల్లోనే... ఏం చేద్ధాం.. కేంద్రం ఆరా!!

Coronavirus
Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (12:05 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం ఫలితంగా ప్రతి రోజూ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 90 శాతం కేసులు ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లు ఉన్నాయి. 
 
గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఈ రాష్ట్రాల్లోని 49 జిల్లాలు కరోనా కేసులకు హాట్‌స్పాట్‌లుగా మారాయని కేంద్రం వెల్లడిస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ 49 జిల్లాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యంగా, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి మహానగరాలపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించి, కోవిడ్ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తోంది. 
 
ఇకపోతే, దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల విషయానికొస్తే, 86 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా, మరణాల సంఖ్య అధికంగా ఉండటం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం 18వ భేటీ నిర్వహించగా, ఈ వివరాలను ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ వెల్లడించారు. మరణాల రేటు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు ఆయన తెలిపారు. కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న టాప్-5 దేశాలతో పోలిస్తే, ప్రతి 10 లక్షల మందిలో 1,452 కేసులు, 68.7 మరణాలు సంభవిస్తుండగా, దేశంలో ఇది 538 కేసులు, 15 మరణాలుగా మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
 
"సమీప భవిష్యత్తులో కొవిడ్-19ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన కంటెయిన్మెంట్ నిబంధనలు, నిఘా, టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వంటి కార్యక్రమాలను చేపట్టనున్నాం. పెరుగుతున్న హాట్ స్పా‌ట్‌ల సంఖ్యను ఆరోగ్య సేతు వంటి యాప్‌లను మరింతగా ప్రోత్సహించడం ద్వారా తగ్గిస్తాం" అని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments