Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా బాధితులకు సాయం చేసేందుకు వస్తే ఆ వీడియోలు పంపి సరేనా అంటూ మెసేజ్ చేసిన ఇంజినీర్

కరోనా బాధితులకు సాయం చేసేందుకు వస్తే ఆ వీడియోలు పంపి సరేనా అంటూ మెసేజ్ చేసిన ఇంజినీర్
, గురువారం, 9 జులై 2020 (20:10 IST)
చెన్నై సిటీ పరిధిలోని రాయపురం మండలం ప్రాంతంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా కమల్ కన్నన్ పనిచేస్తున్నాడు. మన్నడిలో వాలంటీర్‌గా కరోనా సేవలను అందించేందుకు ఒక కళాశాలకు చెందిన విద్యార్థిని వచ్చింది. 
 
ఆమెపై కన్నేశాడు అసిస్టెంట్ ఇంజనీర్. ఆమెకు దగ్గరయ్యేందుకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. ఆమెకు ప్రతిరోజు చిన్నచిన్న పనులను చెప్పించి చేయించేవాడు. అందరి ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు అసిస్టెంట్ ఇంజనీర్. తనకు నెలకు 78 వేల జీతం వస్తోందని.. అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ర్యాంక్ తనదని.. దీన్నిబట్టి చూస్తే తనతో ఉంటే ఎంత సుఖం, ఎంత ఆనందం లభిస్తుందో మాటల్లో చెప్పలేనని మెసేజ్‌లు పంపాడు.
 
వాట్సాప్ నిండా అసిస్టెంట్ ఇంజనీర్ వారి ప్రేమ లేఖలే. ఆయనకు ఇప్పటికే పెళ్ళయిన ఇద్దరు పిల్లలున్నారు. వారు కూడా పెళ్ళీడుకు వచ్చిన వారే. కమల్ ఎన్ని చెప్పినా ఆ విద్యార్థిని పట్టించుకోలేదు. అతని బాగోతాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంది.
 
విధుల్లో ఉండగానే తాను అతనితో చాట్ చేయడం ప్రారంభించింది. ఆ మొత్తం ఛాటింగ్ వ్యవహారంతో పాటు అసభ్యకరంగా అసిస్టెంట్ ఇంజనీర్ పంపిన వీడియోలను కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందు నీ సంగతి చూసుకో.. విజయసాయిపై బీజేపీ నేతల మాటల దాడి