Webdunia - Bharat's app for daily news and videos

Install App

7718955555 : ఇక గ్యాస్‌ బుకింగ్‌ నెంబర్‌ ఇదే

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:00 IST)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు దేశ‌వ్యాప్తంగా ఒకే నంబ‌రును న‌వంబ‌రు 1 నుంచి ప్రారంబిస్తున్నట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎల్‌.పి.ఫుల్ జిలె తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు ప్రాంతాల వారీగా రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు వివిధ ఫోన్ నంబ‌ర్లు ఉండేవ‌ని తెలిపారు. అయితే న‌వంబ‌రు 1వ తేదీ నుంచి ఒకే మొబైల్ నంబ‌రు ద్వారా దేశ వ్యాప్తంగా రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

7718955555 ఫోన్ నంబ‌రు ద్వారా 24 గంట‌లు పాటు రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే సౌల‌భ్యం వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు. అలాగే 7588888824 ఫోన్ నంబ‌రుకు వాట్సాప్ ద్వారా రీఫిల్‌ను బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు.

పేటీఎం, అమెజాన్‌, గూగుల్ పే ద్వారా బుకింగ్ మ‌రియు చెల్లింపులు చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. వీటికి సంబంధించి ఇత‌ర వివ‌రాలు https://cx.indianoil.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు.

విలేక‌రుల స‌మావేశంలో ఐఓసి కృష్ణాజిల్లా సేల్స్ మేనేజ‌ర్ జి.వి.వి.ముక్తేశ్వ‌ర‌రావు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూట‌ర్ కృష్ణా జిల్లా అధ్య‌క్షులు కోన శ‌ర‌త్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల్‌పిజి డీల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సీహెచ్ శంక‌ర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు నుంచి రక్షిణ కల్పించలేం కానీ... వర్మకు హైకోర్టులో షాక్!

పుష్ప-2- 275 కోట్ల రూపాయలకు టీవీ రైట్స్.. నెట్‌ఫ్లిక్స్ అదుర్స్

మొన్న కిరణ్ - నిన్న వరుణ్ - నేడు విశ్వక్.. టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయారు..

ఆ కష్ట సమయంలో నా భార్య వెన్నెముకగా నిలిచింది : జానీ మాస్టర్

'పుష్ప-2' ట్రైలర్‌లో అరగుండుతో కనిపించే నటుడు ఎవరబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments