పాము కరిచింది.. కానీ బెదరలేదు.. ఆ ఏడేళ్ల బుడ్డోడు ఏం చేశాడంటే..?

Webdunia
గురువారం, 29 జులై 2021 (09:32 IST)
పాము కరిచింది. అయినా బెదరలేదు. ఏడేళ్ల వయస్సులోనే ధైర్యంగా నిలిచాడు.. ఆ బాలుడు. చచ్చిన పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఈ పాము నన్ను కరిచింది అంటూ వైద్యులకు చూపించాడు. ఏమాత్రం అధైర్యపడకుండా చికిత్స చేయించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో జరిగింది. రాము కుమారుడు దర్షిత్‌ (7) మూడో తరగతి చదువుతున్నాడు. 
 
ఈ నెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని అవ్వ వద్దకు వెళ్లాడు. పొలంలో ఆడుకుంటున్న సమయంలో ఏదో కరిచినట్లుగా అనిపించింది. వెంటనే అదేంటో వెతికాడు.. పక్కనే రక్తపింజరి జాతి పాము కనిపించింది. కానీ, ఆ బుడ్డోడు ఏమాత్రం బయపడలేదు. 
 
పొలంలోకి పాకుతున్న పామును వెంటాడి పట్టుకున్నాడు. రాళ్లతో కొట్టి పామును చంపేశాడు. ఆ పామును చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చూపించాడు. అనంతరం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. విషపు పాము కరిచినా బాలుడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించారు. ఆ తర్వాత బాలుడి కాలు ఉన్నట్టుండి బాగా వాచిపోయింది.
 
ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం దర్షిత్ కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా బాలుడిని ఆస్పత్రి వైద్యులు పామును ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు.. అందుకు అతడు.. తనను ఏ పాము కరిచిందో తెలిస్తే కదా.. మీరు ట్రీట్ మెంట్ చేయగలిగేది అన్నారు. అంతే.. వైద్య బృందం అతడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments