Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ సీజన్‌కు అతిపెద్ద సేల్‌ను ప్రకటించిన లైఫ్‌స్టైల్‌: సుప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్లపై 50% వరకూ తగ్గింపు

Advertiesment
Lifestyle
, శుక్రవారం, 23 జులై 2021 (22:31 IST)
అత్యాధునిక బ్రాండ్ల కోసం భారతదేశంలో సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌ స్టైల్‌ తమ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న సేల్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా జాతీయ మరియు అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లపై 50% వరకూ మరియు అంతకు మించి అసాధారణ రాయితీలను అందించనున్నారు.
 
లైఫ్‌స్టైల్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసిన వినియోగదారులు స్టోర్‌లో మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ డాట్‌ కామ్‌ వద్ద కూడా ఈ ఆఫర్‌ పొందగలరు. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు గ్రహీతలు అదనంగా 5% రాయితీని 5వేల రూపాయల కనీస కొనుగోళ్లపై లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌, లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ డాట్‌ కామ్‌ మరియు లైఫ్‌స్టైల్‌ మొబైల్‌ యాప్స్‌ పై పొందవచ్చు (షరతులు వర్తిస్తాయి)
 
ఫ్యాషన్‌ అభిమానులకు అసలైన ఆనందాన్ని లైఫ్‌స్టైల్‌ సేల్‌ అందించగలదనే వాగ్ధానం చేస్తుంది. ఇది అద్భుతమైన ఆఫర్లను విభిన్న విభాగాలు, బ్రాండ్ల తాజా ధోరణులపై అందిస్తుంది. స్టోర్ల వద్ద వినియోగదారులు లైఫ్‌స్టైల్‌ యొక్క విజయవంతమైన ఫ్యాషన్‌ బ్రాండ్ల జాబితా అయినటువంటి ఫోర్కా, జింజర్‌ ; మెలాంజ్‌, కప్పా, కోడ్‌, బొస్సినీ, ఫేమ్‌ ఫరెవర్‌, జూనియర్స్‌ మరియు మరెన్నో వాటిపై మాత్రమే కాకుండా సుప్రసిద్ధ బ్రాండ్లు అయినటువంటి జాక్‌ అండ్‌ జోన్స్‌, వెరో మోడా, ఓన్లీ, మే బీలైన్‌,  లాక్మే, టైటాన్‌, టామీ హిల్‌ఫిగర్‌, లేవీస్‌, లూయిస్‌ ఫిలిఫ్పీ మరియు మరెన్నో వాటి నుంచి ఎంచుకోవచ్చు. 
 
మెన్స్‌వేర్‌ మొదలు, కిడ్స్‌వేర్‌, ఉమెన్స్‌ వేర్-పాశ్చాత్య మరియు ఎథ్నిక్‌; బ్యూటీ మరియు మేకప్‌ మొదలు వాచీలు, ఫ్రాగ్నాన్స్‌లు , ఫుట్‌వేర్‌, హ్యాండ్‌బ్యాగ్‌లు, యాక్ససరీలను ఎంచుకోవచ్చు. వినియోగదారులు అత్యుత్తమ ధోరణులను అత్యంత ఆకర్షణీయమైన ధరలో పొందవచ్చు. మీ అభిమాన ఫ్యాషన్‌ కేంద్రం వద్ద కొనుగోలు చేయడంతో పాటుగా మీ వార్డ్‌రోబ్‌కు ఆకర్షణీయమైన మేకోవర్‌ అందించవచ్చు.
 
లైఫ్‌స్టైల్‌ సేల్‌ అన్ని లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ వద్ద మరియు ఆన్‌లైన్‌లో లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ డాట్‌ కామ్‌, యాప్‌ వద్ద అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. విజయవాడలో లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ ఒయాసిస్‌సెంటర్‌, ఎంజీ రోడ్‌ వద్ద ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచారం చేసినవాడిని వేటాడాల్సిందే: తమ్మినేని సంచలన వ్యాఖ్యలు