Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రబలంగా ఉన్న జీవనశైలి వ్యాధులు- నివారణ మరియు సంరక్షణ

ప్రబలంగా ఉన్న జీవనశైలి వ్యాధులు- నివారణ మరియు సంరక్షణ
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:42 IST)
ఆరోగ్యవంతమైన జీవనశైలి అత్యుత్తమ జీవితానికీ భరోసా అందిస్తుందన్నది అందరికీ తెలిసినదే. కానీ పనిజీవితం, వ్యక్తిగత లక్ష్యాలు వంటివి మనిషిని పలు వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. ప్రస్తుత మహమ్మారి సైతం ఇప్పుడు ఎన్నో సవాళ్లను తీసుకువచ్చింది. శారీరక వ్యాయాయం లేకపోవడం, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతితో అధిక ఒత్తిడి వంటివి సైతం ఇప్పుడు ఎన్నో సమస్యలను తీసుకువస్తున్నాయి. మనమంతా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుక చేసుకుంటున్న వేళ, అతి సాధారణ జీవనశైలి వ్యాధుల పట్ల శ్రద్ధ చూపడంతో పాటుగా ఇటీవలి కాలంలో అవి ఎంత ప్రబలంగా మారుతున్నాయనే అంశం తెలుసుకుందాం.
 
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాదు ఆరోగ్య సూచీల పరంగా ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతంలో 11 దేశాలలో 10వ స్థానంలో ఉంది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రకారం భారతదేశంలో 61% మరణాలకు జీవనశైలి లేదా నాన్‌ కమ్యూనికబల్‌ వ్యాధులు కారణం. ఈ నివేదికలే వెల్లడిస్తున్న దానిప్రకారం ప్రతి 12వ భారతీయుడూ మధుమేహ వ్యాధిగ్రస్తుడు. అత్యధిక మధుమేహ రోగులు కలిగిన రెండవ దేశం ఇండియా.
 
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కృత్రియ స్వీట్‌నర్లు, కొవ్వు పదార్థాలు వంటివి ఇటీవలి కాలంలో అతి ప్రధానమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఇవి గాక ఆల్కహాల్‌, సరిగా నిద్రపోకపోవడం, పొగతాగడం వంటివి సైతం వైద్య పరంగా సమస్యలు అధిగమవుతుండటానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
 
శరీరంలో ఊహించని రీతిలో బరువు పెరగడం వల్ల మధుమేహ సమస్య కూడా పెరుగుతుంది. అనియంత్రిత మధుమేహం, అధిక రక్తపోటు వంటివి బ్రెయిన్‌ స్ట్రోక్స్‌, నరాల బలహీనత, కిడ్నీఫెయిల్యూర్‌ వంటి సమస్యలూ కలుగుతాయి. తొలి దశలో థైరాయిడ్‌ లక్షణాలు కనిపించకపోవచ్చు కానీ దీనివల్ల ఉబకాయం, గుండె వ్యాధులు, సంతానలేమి సమస్యలు, స్లీప్‌ అప్నియా కలుగవచ్చు.
webdunia
ఈ సమస్యలను అధిగమించేందుకు అనుసరించాల్సిన పలు ఆరోగ్య సూత్రాలు
 
ఆరోగ్యవంతమైన ఆహార ప్రాధాన్యతలు తీసుకోవాలి: సమపాళ్లలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్‌, న్యూట్రియంట్స్‌, విటమిన్స్‌ లభిస్తాయి. సరైన డైట్‌ ప్రణాళికను అనుసరించడం అవసరం. గ్రీన్‌ వెజిటేబుల్స్‌, విటమిన్‌ ఏ, కాల్షియం, ఫైబర్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. తగినంతగా నీరు తీసుకోవడమూ అవసరమే. నీటి ఆధారిత ఆహారం అయిన పుచ్చకాయ, తర్బుజా, ద్రాక్ష లాంటివి సైతం తీసుకోవచ్చు. తినే ఆహారం మితంగా ఉండాలి.
 
మీ రోజువారీ కార్యక్రమంలో శారీరక వ్యాయామాలు భాగం చేసుకోండి: శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సమతుల్యమైన ఆహారం, శారీరక శ్రమ అవసరం. రోగ నిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచుకునేందుకు రోజుకు కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. ఏ వయసు వారికి అయినా వాకింగ్‌ అత్యుత్తమ వ్యాయామంగా భావించబడుతుంది. ఇంటి పనులు చేసుకోవడం,. తేలికపాటి యోగాతో ఒత్తిడి, ఆందోళనను నివారించుకోవచ్చు.
 
శరీర బరువు నియంత్రించుకోవాలి: శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటుగా తగిన పర్యవేక్షణ కూడా అవసరం. శరీర బరువు పెరిగితే ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్‌ పెరిగే అవకాశాలున్నాయి.
 
పొగతాగడం, మద్యం సేవించడం చేయరాదు: సిగరెట్లలో ఉండే థియోసైనేట్‌, నికోటిన్‌ కారణంగా అయోడిన్‌ త్వరగా కోల్పోవడం జరుగవచ్చు. ఇది థైరాయిడ్‌ పెరగడానికి, ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం కావొచ్చు. పొగతాగడం, మద్యం సేవించడం వదిలేస్తే శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది.
 
స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించుకోవాలి: మొబైల్‌ ఫోన్ల వినియోగం తగ్గించుకోవాలి. మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్‌ ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతుంది. మరీముఖ్యంగా థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారు ! అందువల్ల నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్‌ ఫోన్ల వినియోగం తగ్గించుకోవాలి. హాయిగా నిద్రపోయేందుకు, ఉదయమే ఆహ్లాదకరంగా నిద్ర లేచేందుకు ఇది  తోడ్పడుతుంది.
 
- డాక్టర్‌ ఎల్‌ సంజయ్‌, జనరల్‌ ఫిజీషియన్‌, అపోలో స్పెకా్ట్ర హాస్పిటల్‌, కొండాపూర్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్డసరం మొక్కతో కరోనాకు విరుగుడు.. ఆయుర్వేద గుణాలెన్నో..?