Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్.. ఏడుగురు చిన్నారుల మృతి

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (14:17 IST)
అడెనో వైరస్ కారణంగా ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్ కారణంగా రెండేళ్ల లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
తాజాగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, చాలామంది ఆస్పత్రి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదైనాయి.  
 
ఏడుగురు చిన్నారుల్లో కోల్‌కతాలోని  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 
 
రాష్ట్రంలో అడెనో వైరస్‌ పరిస్థితిపై సీఎం మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర హెల్ప్‌లైన్ 1800-313444-222 నెంబర్లను ప్రకటించారు.
 
అడెనోవైరస్ సోకడం వల్ల తేలికపాటి జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments