Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 యేళ్ల బాలికపై ఆరుగురు మైనర్ల అత్యాచారం

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:42 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 11 యేళ్ల మైనర్ బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఖుంతి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. నిందితులు 10 నుంచి 15 యేళ్ల లోపువారు కావడం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, బాధిత బాలిక పక్క గ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరైంది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం‍ సందర్భంగా తనకు ఇంతకుముందే తెలిసిన నిందితులతో వాగ్వివాదం జరిగింది. 
 
ఈ పెళ్లి తర్వాత మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్థరాత్రి వేళ స్వగ్రామానికి బయలుదేరింది. ఆ యువతిని అనుసరించిన మైనర్లు కొంతదూరం వచ్చాక అడ్డగించి, ఆ తర్వాత ఎవరూలేని ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక స్నేహితురాళ్లు జరిగిన విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న బాధిత యువతి తల్లిదండ్రులను చూడగానే వారు పారిపోయారు. 
 
అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు తొలుత బాధిత యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువుపోతుందని వెనుకంజ వేశారు. అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పడి చివరకు పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధిత యువతి తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments