Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో దారుణం.. వితంతువుపై సామూహిక అత్యాచారం.. స్టీల్ గ్లాసును..?

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (14:42 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. యూపీలోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల మహిళపై పూజారి, అతని శిష్యులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే... అదే తరహాలో జార్ఖండ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. చత్రా జిల్లాలోని కోబ్నా గ్రామంలో 50 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతేకాదు ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హంటర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
 
వివరాల్లోకి వెళ్తే కోబ్నా గ్రామానికి చెందిన ఓ వితంతువు ఒంటరిగా జీవిస్తోంది. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు. ఈనెల 7న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా ముగ్గురు చొరబడ్డారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి నరకం చూపించారు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం ఆమెను అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను హంటర్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా.. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments