Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోళికోడ్ తీరంలో తిమింగల కళేబరం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (13:56 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ సముద్రతీరానికి ఓ భారీ తిమింగల కళేబరం కొట్టుకొచ్చింది. దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడుతున్నారు. ఈ తిమింగలం పొడవు దాదాపు 50 అడుగులకు పైమాటగానే ఉంది. అయితే, ఇది బాగా ఉబ్బిపోయి వుండటంతో పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ దాన్ని సమీపానికి జనాలు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
ఈ నీలి తిమింగలం (బ్లూ వేల్) కోళికోడ్ తీరానికి కొట్టుకొచ్చింది. దీని పొడవు 15 మీటర్ల మేరకు ఉంది. స్థానిక జాలర్ల ద్వారా దీనిగురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌కు చేరుకుని తిమింగల కళేబరాన్ని పరిశీలించారు. అయితే, ఇది చనిపోవడానికి కారణాలు తెలియాల్సివుంది. అందుకే తీరంలోనే పోస్టు మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. అలాగే, ఆ తీరంలోనే పెద్గ గొయ్యి తీసి పాతిపెడతామని వారు తెలిపారు. 
 
తీరానికి కొట్టుకొచ్చిన బ్లూవేల్‌ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దీన్ని చూసేందుకు స్థానికులతో పాటు ఇతర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా తీరానికి చేరుకుంటున్నారు. నిజాముద్దీన్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ దయచేసి ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
సాధారణంగా పెద్ద పెద్ద తిమింగలాల కళేబరాల్లో ఉన్న వాయువుల్లో పీడనం ఎక్కువై ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వస్తాయి గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments