Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు బ్యాంకులు బంద్... డిసెంబరు 31 లోగా రూ.500, రూ. 1000 నోట్లు జమ చేస్కోండి...

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిర్ణయం వెలువరించారు. ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. మంగళవ

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (22:09 IST)
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిర్ణయం వెలువరించారు. ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. వెయ్యినోట్లు పనిచేయబోవని మోదీ స్పష్టం చేశారు. 
 
దేశంలో భారీగా పోగుపడ్డ నల్లధనాన్ని నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజల వద్ద ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను మార్చుకోవడానికి డిసెంబర్‌ 30 వరకు సమయం ఇచ్చారు. ఆలోపు బ్యాంకులు, లేదా పోస్టాఫీస్‌లకు వెళ్లి రూ. 500, రూ. వెయ్యి నోట్లను మార్చుకోవాలని ప్రజలకు సూచించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్పస్థానం సంపాధించుకుందని మోదీ అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థను కొనియాడాయని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.
 
పేదవారు స్వయంసమృద్ధి సాధించేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మోదీ చెప్పారు. అవినీతి నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు పేదల అవసరాలు పట్టించుకోలేదని, దొంగ నోట్లు అభివృద్ధికి అవరోధంగా మారాయని, పొరుగు దేశం దొంగనోట్లను రవాణా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ నోట్లలో 90 శాతం వెయ్యి, రూ.500 నోట్లే ఉంటున్నాయని మోదీ చెప్పారు. అభివృద్ధికి ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా మారిందని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments