Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఐదుగురు వైద్యులకు కరోనా- 3నెలలు కర్ఫ్యూ.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 18 మే 2020 (19:27 IST)
Corona Virus
కోవిడ్-19 మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు వైద్యులకు కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,188కి చేరింది. 
 
ఇటీవల ఈఎన్‌టీ సమస్యతో వైద్యం చేయించుకుని మృతి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో... ఆమె ద్వారా ఈ ఐదుగురు వైద్యులకు కరోనా సోకినట్టు భావిస్తున్నారు. కరోనా బారిన పడిన వైద్యుల్లో ఎస్ఎమ్‌హెచ్‌ఎస్ ఆస్పత్రి నుంచి ముగ్గురు, స్కిమ్స్-జేవీసీ ఆస్పత్రి, ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ మూడు ఆస్పత్రులు శ్రీనగర్‌లోనే ఉన్నాయి.
 
ఇక వైరస్‌ బారినపడి మృతి చెందిన హబ్బా కదల్ శ్రీనగర్‌కి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మహిళ మరణంతో కాశ్మీర్‌లో కరోనా వైరస్‌ సోకి మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. వైరస్‌తో మృతి చెందిన హబ్బా కదల్‌ ముందుగా శ్రీమహారాజ హరీసింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమెకు చికిత్స అందించే క్రమంలో ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో మరో మూడు నెలలపాటు కర్ఫ్యూ పొడిగించారు. కరోనా మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఒక్కసారిగా పెరగొచ్చని కలెక్టరలందరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆదివారం నాడు 25 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 92కు చేరుకుంది. 32 మంది చికిత్స పొందుతుండగా.. 59 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments