Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన హల్వా... ఏం జరిగింది?

రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఓ ఇంటికి అతిథులు

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (18:39 IST)
రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఓ ఇంటికి అతిథులు వచ్చారని.. వారి కోసం ఆ కుటుంబీకులు హల్వా చేసి వడ్డించారు. అయితే హల్వా తిన్నవారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఫుడ్ పాయిజన్ కారణంగా వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నా.. వారిపై విష ప్రయోగం చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోనూ ఇదే తరహా ఘటన ఈ  ఏడాది జనవరిలో చోటుచేసుకుంది. 
 
బంధువుల ఇంటికి విందు కోసం వెళ్లిన కొందరు భోజనం చేస్తూనే ఒకరి తర్వాత ఒకరు వరుసగా తొమ్మిది మంది మృతి చెందారు. వీరు కలుషిత ఆహారం వల్ల మృతి చెందారని స్థానికులు అంటున్నా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments