Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత...ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:08 IST)
ఆదిలాబాద్‌లో పానీపూరీ తిన్న 40 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పానీపూరీ తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రుల వారిని వెంటనే ‘రిమ్స్’కు తరలించారు.

ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 40 మంది చిన్నారులు ఆసుపత్రికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రాత్రి 11 గంటల తర్వాత కూడా తల్లిదండ్రులు చిన్నారులను ఆసుపత్రికి తీసుకొస్తూనే ఉన్నారు. బాధితులందరూ ఐదు నుంచి పదేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం.
 
నిన్న సాయంత్రం ఓ పానీపూరి తోపుడుబండి ఒకటి కాలనీలోకి వచ్చింది. పట్టణంలోని ఖుర్షీద్‌నగర్,సుందరయ్యనగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఆ బండివద్ద పానీపూరీ తిన్నారు. అయితే, రాత్రి 9 గంటల తర్వాత పానీపూరీ తిన్న చిన్నారులు ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు చేసుకుంటుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. మొత్తం 40 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరడంతో కలకలం రేగింది. కాగా, చిన్నారులకు ప్రాణాపాయం లేదని, అందరూ కోలుకుంటున్నారని రిమ్స్ డైరెక్టర్ బలరాం బానోత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments